Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) ఫ్రాంచైజీ రాజస్తాన్ రాయల్స్ కోవిడ్-19 సెకెండ్ వేవ్‌కు తక్షణసాయంగా రూ.7.5కోట్లు విరాళం ప్రకటించింది. భారత్‌లో బుధవారం ఒక్కరోజే రికార్డుస్థాయిలో 3,79,257 కోవిడ్ కేసులు నమోదు కావడంతో.. ఇప్పటివరకూ కరోనావైరస్ బారిన పడినవారిసంఖ్య 1,83,76,524చేరింది. దీంతో రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీ స్పందిస్తూ.. తక్షణ సాయంగా ఆ మొత్తాన్ని విడుదల చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మొత్తం ఆటగాళ్లు, యాజమాన్యం, మేనేజ్మెంట్ సభ్యుల నుంచి సమకూర్చడం జరిగిందని, రాజస్తాన్ రాయల్స్ ఫౌండేషన్ పార్టనర్ బ్రిటీష్ ఆసియా ట్రస్ట్(బిఏటి) ఫ్రాంచైజీ అందులో పేర్కొంది. వ్యక్తిగతంగా కోవిడ్ బాధితులకోసం పాట్ కమిన్స్, శ్రీవాత్సవ గోస్వామి, బ్రెట్ లీ, షెల్డన్ జాక్సన్‌లు తమవంతు సాయం అందించి గొప్ప మనసును చాటుకున్న సంగతి తెలిసిందే.