Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోల్‌కతాపై 7 వికెట్ల తేడాతో ఢిల్లీ గెలుపు
అహ్మదాబాద్: ఢిల్లీ క్యాపిటల్స్ యువ ఓపెనర్ పృథ్వీ షా ఆకాశమే హద్దుగా చెలరేగడంతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఆ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐపిఎల్‌లో భాగంగా గురువారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన పోటీలో కోల్‌కతా నైట్‌రైడర్స్ 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేయగా.. ఢిల్లీ క్యాపిటల్స్ 16.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు పథ్వీషా(82; 41 బంతుల్లో 11ఫోర్లు, 3సిక్సర్లు), శిఖర్ ధావన్(46; 47బంతుల్లో 4ఫోర్లు, సిక్సర్) చెలరేగారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 132పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఓపెనర్ శుభ్‌మన్‌గిల్(43), ఆండ్రీ రసెల్(45) టాప్ స్కోరర్లు. ఓపెనర్ నితీశ్ రాణా(15) ఆదిలోనే విఫలమైనా.. శుభ్‌మన్, రాహుల్ త్రిపాఠి(19)తో కలిసి రెండో వికెట్‌కు 44 పరుగులు జోడించాడు. లలిత్ యాదవ్ 11వ ఓవర్లో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, సునీల్ నరైన్‌ను డకౌట్లుగా పెవిలియన్ పంపాడు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీయగా స్టోయినిస్ ఒక వికెట్ పడగొట్టాడు.
లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఓపెనర్లు పృథ్వీ షా, ధావన్ అదిరే ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరే లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించినా.. ధావన్(46) అర్ధసెంచరీకి దగ్గర్లో ఔటయ్యాడు. ఇక పృథ్వీ షా అర్ధసెంచరీని కేవలం 17 బంతుల్లోనే పూర్తిచేయగా.. ధాటిగా ఆడే క్రమంలో షా(82; 41 బంతుల్లో 11ఫోర్లు, 3సిక్సర్లు) చివర్లో ఔటయ్యాడు. కమ్మిన్స్‌కు మూడు వికెట్లు దక్కగా.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పృథ్వీ షాకు దక్కింది. దీంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి ఎగబాకింది.
స్కోర్‌బోర్డు..
కోల్‌కతా నైట్‌రైడర్స్: నితీష్ రాణా (స్టంప్)పంత్ (బి)అక్షర్ 15, శుభ్‌మన్ (సి)స్మిత్ (బి)ఆర్ష్‌దీప్ సింగ్ 43, త్రిపాఠి (సి)లలిత్ యాదవ్ (బి)స్టోయినీస్ 19, మోర్గాన్ (సి)స్మిత్ (బి)లలిత్ యాదవ్ 0, నరైన్ (బి) లలిత్ యాదవ్ 0, రస్సెల్ (నాటౌట్) 45, కార్తీక్ (ఎల్బి) అక్షర్ 14, కమ్మిన్స్ (నాటౌట్) 11, అదనం 7. (20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి) 154 పరుగులు.
వికెట్ల పతనం: 1/25, 2/69, 3/74, 4/75, 5/82, 6/109
బౌలింగ్: ఇషాంత్ 4-0-34-0, రబాడ 4-0-31-0, అక్షర్ 4-0-32-2, ఆవేశ్ 4-0-31-1, లలిత్ యాదవ్ 3-0-13-2, స్టోయినీస్ 1-0-7-1.
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా (సి)నితీష్ (బి)కమ్మిన్స్ 82, ధావన్ (ఎల్బి) కమ్మిన్స్ 46, పంత్ (సి)శివమ్ మావి (బి)కమ్మిన్స్ 16, స్టోయినీస్ (నాటౌట్) 6, హెట్మెయిర్ (నాటౌట్) 0, అదనం 6. (16.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి) 156 పరుగులు.
వికెట్ల పతనం: 1/132, 2/146, 3/150
బౌలింగ్: శివమ్ మావి 1-0-25-0, చక్రవర్తి 4-0-34-0, ప్రసిధ్ కృష్ణ 3.3-0-36-0, నరైన్ 4-0-36-0, కమ్మిన్స్ 4-0-24-3.