Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజస్తాన్‌పై 7వికెట్ల తేడాతో ఘన విజయం
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రిమియర్‌లీగ్(ఐపిఎల్) సీజన్-14లో ముంబయి మరో మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. గురువారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి 7 వికెట్ల తేడాతో గెలిచింది. రాజస్తాన్ తొలిగా బ్యాటింగ్‌కు దిగి 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో ముంబయి 18.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 172 పరుగులు చేసి గెలిచింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ డికాక్(70నాటౌట్) ముంబయి గెలుపులో కీలకపాత్ర పోషించాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్‌కు ఓపెనర్లు జోస్ బట్లర్(41; 32బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సర్లు), యశస్వి జైశ్వాల్(32; 20బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) శుభారంభం చేశారు. వీరిద్ద్దరూ తొలి వికెట్‌కు 66 పరుగులు జోడించారు. అయితే ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని రాహుల్ చాహర్ వరుస ఓవర్లలో పెవిలియన్ పంపాడు. 8వ ఓవర్లో బట్లర్‌ను స్టంపౌట్ చేసిన ముంబయి స్పిన్నర్ తర్వాతి ఓవర్లో యశస్విని క్యాచ్ అండ్ బౌల్డ్ చేశాడు. అప్పటికి రాజస్లాన్ పది ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసి భారీస్కోర్ దిశగా పయనిస్తోంది. ఈ క్రమంలో కెప్టెన్ సంజూ శాంసన్(42; 27బంతుల్లో 5ఫోర్లు), శివమ్ దూబె(35; 31బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) రాణించినా చివర్లో ధాటిగా ఆడే క్రమంలో ఔటయ్యారు. బౌల్ట్ సంజూను బౌల్డ్ చేయగా దూబేను బుమ్రా పెవీలియన్‌కు పంపాడు. రాహుల్ చాహర్‌కు రెండు, బౌల్ట్, బుమ్రాకు తలా ఒక వికెట్ దక్కాయి. అనంతరం ముంబయి కెప్టెన్ రోహిత్(14), డికాక్(70నాటౌట్) తొలి వికెట్‌కు 6 ఓవర్లలో 49 పరుగులు జతచేశారు. ఆ తర్వాత రోహిత్, సూర్యకుమార్(16) ఔటైనా.. కృనాల్‌తో కలిసి డికాక్ ముంబయిను విజయానికి చేరువగా తీసుకెళ్లాడు. ధాటిగా ఆడే క్రమంలో కృనాల్ (39)ను ముస్తఫిజుర్ బౌల్డ్ చేశాడు. మిగతా పనిని పొలార్డ్(16నాటౌట్; 8బంతుల్లో 2ఫోర్లు, సిక్సర్) పూర్తిచేశాడు. మోరిస్‌కు రెండు, ముస్తఫిజుర్‌కు ఒక వికెట్ దక్కాయి.
రాజస్తాన్ రాయల్స్: బట్లర్ (స్టంప్)డికాక్ (బి)రాహుల్ చాహర్ 41, జైస్వాల్ (సి అండ్ బి) రాహుల్ చాహర్ 32, సంజు శాంసన్ (బి)బౌల్ట్ 42, దూబే (సి అండ్ బి)బుమ్రా 35, డేవిడ్ మిల్లర్ (నాటౌట్) 7, రియాన్ పరాగ్ (నాటౌట్) 8, అదనం 6. (20ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి) 171 పరుగులు.
వికెట్ల పతనం: 1/66, 2/91, 3/148, 4/158
బౌలింగ్: బౌల్ట్ 4-0-37-1, బుమ్రా 4-0-15-1, జయంత్ యాదవ్ 3-0-37-0, కల్టన్ నైల్ 4-0-35-0, రాహుల్ చాహర్ 4-0-33-2, కృనాల్ పాండ్యా 1-0-12-0
ముంబయి ఇండియన్స్: రోహిత్ శర్మ (సి)సకారియ (బి)మోరిస్ 14, డికాక్ (నాటౌట్) 70, సూర్యకుమార్ యాదవ్ (సి)బట్లర్ (బి)మోరిస్ 16, కృనాల్ పాండ్యా (బి)ముస్తఫిజుర్ 39, పొలార్డ్ (నాటౌట్) 16, అదనం 17. (18.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి) 172 పరుగులు.
వికెట్ల పతనం: 1/49, 2/83, 3/146
బౌలింగ్: సకారియ 3-0-18-0, ఉనాద్కట్ 4-0-33-0, ముస్తఫిజుర్ 3.3-0-37-1, మోరిస్ 4-0-33-2, తెవాటియ 3-0-30-0, దూబే 1-0-6-0.