Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒలింపిక్స్ నిర్వహిస్తాం: హషిమోటో
టోక్యో: ప్రేక్షకుల్లేకుండా ద్వారాలు మూసైనా ఒలింపిక్స్‌ను జరిపి తీరుతామని టోక్యో ఒలింపిక్స్ చీఫ్, మాజీ ఒలింపియన్ హషిమోటో స్పష్టం చేశారు. కరోనా ఉధృతి నేపథ్యంలో స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఒలింపిక్స్‌ను సురక్షిత వాతావరణంలో జరుపుతామని, పోటీల్లో పాల్గొనే అథ్లెట్ల ఆరోగ్యం మరింత ముఖ్యమన్నారు. అవసరమైతే ప్రేక్షకుల్లేకుండా ద్వారాలు మూసైనా ఒలింపిక్స్‌ను జరిపి తీరుతామని.. వాయిదా, రద్దుచేసే ప్రసక్తిలేదన్నారు. ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లకు నిరంతరం పర్యవేక్షించేందుకు నిరంతరం మెడికల్ స్టాఫ్, వాలంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఇక విదేశీ ప్రేక్షకులకు అనుమతిని పూర్తిగా రద్దు చేసిన జపాన్ ప్రభుత్వం స్వదేశీ ప్రేక్షకులకు అనుమతిపై జూన్‌లో నిర్ణయం తీసుకోనుంది. ఇక గత ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్ కోవిడ్-19 కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడిన సంగతి తెలిసిందే.