Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అహ్మదాబాద్: పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో పంజాబ్ ఈ సీజన్లో మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్)లో భాగంగా శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 34 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. లక్ష్య ఛేదనలో బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసి పరాజయంపాలైంది.
టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ను కేఎల్ రాహుల్(91నాటౌట్; 57బంతుల్లో 7ఫోర్లు, 5సిక్సర్లు), సీనియర్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్(46; 24బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు) రాణించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 80 పరుగులు జతచేశారు. దీంతో పవర్‌ప్లే 6 ఓవర్లలోనే పంజాబ్ వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది. గేల్ నిష్క్రమణ అనంతరం కెప్టెన్ కేఎల్ రాహుల్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఆ తర్వాత మిగతా బ్యాట్స్‌మెన్ కనీసం క్రీజులో నిలవలేకపోయారు. ప్రభు సిమ్రాన్ సింగ్(7), నికోలస్ పూరన్(0), దీపక్ హుడా(5), షారుక్ ఖాన్(0) నిరాశపరిచారు. బెంగళూరు బౌలర్లలో జేమీసన్ రెండు వికెట్లు తీయగా డేనియల్ సామ్స్, యుజువేంద్ర చాహల్, షాబాజ్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. ఈ సీజన్ ఐపిఎల్‌లో అత్యధిక వికెట్ల వీరుడు హర్షల్ పటేల్ వికెట్ తీసుకోకపోగా 4 ఓవర్లలో13.25 ఎకాన మీతో 53 పరుగులు సమర్పించుకున్నా.. బ్యాటింగ్‌కు సత్తా చాటాడు.
లక్ష్య ఛేదనలో బెంగళూరును కెప్టెన్ కోహ్లి(35) ఆదుకున్నా.. పడిక్కల్(7) నిరాశపరిచాడు. పటీదర్(31), జేమీసన్(16), చివర్లో హర్షల్(31)మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్ చేశారు. బెంగళూరు జట్టు 15.5 ఓవర్లలో 97 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి విజయాన్ని దరిదాపుల్లో లేకపోయింది. బ్రార్‌కు మూడు, బిష్ణోరుకు రెండు వికెట్లు దక్కాయి.
పంజాబ్ కింగ్స్: కేఎల్ రాహుల్ (నాటౌట్) 91, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (సి)కోహ్లి (బి)జెమీసన్ 7, గేల్ (సి)డివిలియర్స్ (బి)శామ్స్ 46, పూరన్ (సి)షాబాజ్ (బి)జెమీసన్ 0, హుడా (సి)రజత్ పటిదర్ (సి)షాబాజ్ 5, షారుక్ ఖాన్ (సి)చాహల్ 0, హర్‌ప్రీత్ బ్రార్ (నాటౌట్) 25, అదనం 5. (20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి) 179 పరుగులు.
వికెట్ల పతనం: 1/19, 2/99, 3/107, 4/117, 5/118
బౌలింగ్: శామ్స్ 4-0-24-1, సిరాజ్ 3-0-24-0, జెమీసన్ 3-0-32-2, చాహల్ 4-0-34-1, హర్షల్ పటేల్ 4-0-53-0, షాబాజ్ 2-0-11-1.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: కోహ్లి (బి)హర్‌ప్రీత్ బ్రార్ 35, పడిక్కల్ (బి)మెరిడిత్ 7, పటీదర్ (సి)పూరన్ (బి)జోర్డాన్ 31, మ్యాక్స్‌వెల్ (బి)హర్‌ప్రీత్ బ్రార్ 0, డివిలియర్స్ (సి)రాహుల్ (బి)హర్‌ప్రీత్ బ్రార్ 3, షాబాజ్ (సి)హర్‌ప్రీత్ బ్రార్ (బి)బిష్ణోరు 8, శామ్స్ (బి)బిష్ణోరు 3, జెమీసన్ (నాటౌట్) 16, హర్షల్ పటేల్ (సి)బిష్ణోరు (బి)షమీ 31, సిరాజ్ (నాటౌట్) 0, అదనం 11. (20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి) 145 పరుగులు.
వికెట్ల పతనం: 1/19, 2/62, 3/62, 4/69, 5/91, 6/96, 7/96, 8/144
బౌలింగ్: మెరిడిట్ 3.2-0-29-1, షమీ 3.4-0-28-1, బిష్ణోరు 4-0-17-2, హర్‌ప్రీత్ బ్రార్ 4-1-19-3, జోర్డాన్ 4-0-31-1, హుడా 1-0-13-0