Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పల్లెకెలె: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండోటెస్ట్‌లో ఆతిథ్య శ్రీలంక జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యత లభించింది. శుక్రవారం బంగ్లాదేశ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 251పరుగులకే పరిమితం చేయడంతో లంకకు 242 పరుగుల భారీ ఆధిక్యత లభించింది. వికెట్ కీపర్ డిక్వెల్లా(77) అజేయంగా ఉండగా.. మెండిస్(33) పరుగులకు ఔటయ్యాడు. దీంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 493పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా జట్టును 22ఏళ్ల అరంగేట్ర ఆటగాడు జయ విక్రమానే(6/92) దెబ్బతీశాడు. దీంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 251 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్(92), మౌమినుల్(49), రహీమ్(40) మాత్రమే రాణించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక 17 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది. తిరిమానే(2), ఫెర్నాండో(1) స్వల్పస్కోర్‌కే ఔట్ కాగా.. మూడోరోజు ఆట ముగిసే సమయానికి కరుణరత్నే(13), మాథ్యూస్(1) క్రీజ్‌లో ఉన్నారు. శ్రీలంకకు బంగ్లాపై ఇప్పటికే 259 పరుగుల ఆధిక్యత లభించింది.