Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌కు భారత్‌కు చెందిన మహిళా జిమ్నాస్ట్ ప్రణతి నాయక్ ఆసియా కోటాలో అర్హత సాధించింది. 2019లో జరిగిన ఆసియా ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ప్రణతి కాంస్య పతకం గెల్చుకోవడంతో ప్రణతికి జాక్‌పాట్ దక్కింది. టోక్యో ఒలింపిక్స్‌కు జిమ్నాస్టిక్స్ అర్హత మ్యాచ్‌లు కరోనా వైరస్‌తో రద్దు కావడంతో 26ఏళ్ల పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రణతికి ఈ అవకాశం లభించింది. ఇక శ్రీలంకకు చెందిన ఎల్పిటియ బడల్గేడోనా మిల్కా ఆసియా కోటాలో రెండో స్థానంలో ఉంది. అనివార్య కారణాలవల్ల ప్రణతి ఒలింపిక్స్‌కు దూరమైన పక్షంలో శ్రీలంక జిమ్నాస్ట్‌కు టోక్యో ఛాన్స్ దక్కనుంది. 9వ ఆసియా జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు చైనాలోని హాంగ్జూవేదికగా మే 29నుంచి జరగాల్సి ఉండగా.. కోవిడ్-19 కారణంగా రద్దు అయ్యాయి.