Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: కరోనా సాయంగా టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అజింక్యా రహానే తనవంతు సాయం ప్రకటించాడు. '30 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ టు మిషన్ వాయు' స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇచ్చాడు. రహానె చేసిన సాయానికి మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ కృతజ్ఞతలు తెలిపింది. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ను మహారాష్ట్రలోని అత్యంత కరోనా ప్రభావిత ప్రాంతాలకు వీటిని పంపుతామని ప్రకటించింది. 'మిషన్ వాయుకు 30 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అందించిన రహానెకు ధన్యవాదాలు. మహారాష్ట్రలో కరోనా ఉధృతి అధికంగా ఉన్న జిల్లాలకు వీటిని అందజేస్తామని' ట్వీట్లో పేర్కొంది.