Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అహ్మదాబాద్: కేన్ విలియమ్సన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ డేవిడ్ వార్నర్‌ను తప్పించి, విలియమ్సన్స్కు సారథ్య బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ట్విటర్ లేఖలో పేర్కొంది. హైదరాబాద్ తన తర్వాతి మ్యాచ్‌లో మే 2న రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. రాజస్థాన్‌తో జరగబోయే మ్యాచ్‌తో పాటు లీగ్‌లో మిగతా మ్యాచ్‌లకు విలియమ్సన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని ఆ లేఖలో పేర్కొంది. ఈ సీజన్లో హైదరాబాద్ పేలవ ప్రదర్శనతో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో కేవలం ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించింది. ఇక బాల్‌ట్యాంపరింగ్ కారణంగా 2019 సీజన్లో సన్‌రైజర్స్ జట్టుకు విలియమ్సన్ నాయకత్వం వహించాడు. కేన్ కెప్టెన్సీలో గత సీజన్లో లీగ్‌లో హైదరాబాద్ నాల్గో స్థానంలో నిలిచి ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. 2016లో వార్నర్ సారథ్యంలోనే హైదరాబాద్ తొలిసారి టైటిల్ ముద్దాడింది.