Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంజాబ్ కింగ్స్‌పై ఏడువికెట్లతో గెలుపు
- మయాంక్ సెంచరీ మిస్
- మళ్లీ టాప్‌లోకి ఢిల్లీ
అహ్మదాబాద్: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) ఢిల్లీ క్యాపిటల్స్ మరో విజయాన్ని నమోదు చేసుకుంది. ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత పంజాబ్ కెప్టెన్ అగర్వాల్(99నాటౌట్; 58 బంతుల్లో 8ఫోర్లు, 4సిక్సర్లు) రాణించడంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ 17.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ ధావన్(69నాటౌట్) ఢిల్లీ గెలుపులో కీలకపాత్ర పోషించాడు.
టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌ను ఓపెనర్, కెప్టెన్ మయాంక్ అగర్వాల్(99 నాటౌట్: 58బంతుల్లో.. 8ఫోర్లు, 4సిక్సర్లు) చివరివరకు క్రీజులో పాతుకుపోయాడు. తొలుత వికెట్లు కాపాడుకుంటూ నెమ్మదిగా ఆడిన మయాంక్.. అర్థ సెంచరీ దాటాక ఎదురుదాడికి దిగాడు. అర్థ సెంచరీని 37 బంతుల్లో పూర్తిచేసిన మయాంక్.. ఆ తర్వాత 21బంతుల్లోనే 49పరుగులతో అదరగొట్టాడు. అయితే సెంచరీకి కేవలం ఒక్క పరుగు దూరంలో ఓవర్లు పూర్తి కావడంతో సెంచరీని మిస్ చేసుకున్నాడు. దీంతో పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేయగల్గింది. ఢిల్లీ బౌలర్లలో రబాడకు మూడు, ఆవేష్ ఖాన్, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కాయి. అనంతరం ఢిల్లీ ఓపెనర్లు పృథ్వీ షా(39), ధావన్(69నాటౌట్) కలిసి తొలి వికెట్‌కు 6 ఓవర్లలోనే 63 పరుగులు జతచేసి గట్టి పునాది వేశారు. ఆ తర్వాత స్టీవ్ స్మిత్(24), పంత్(14) సహకారంతో ధావన్ మరింత చెలరేగి ఆడాడు. వీరిద్దరూ నిష్క్రమించినా మ్యాచ్ ముగిసేవరకు ధావన్ క్రీజ్‌లో పాతుకుపోగా.. ఆఖర్లో హెట్మెయిర్(16నాటౌట్; 4బంతుల్లో ఫోర్, 2సిక్సర్లు) మ్యాచ్‌ను ముగించారు. ఈ గెలుపులో ఢిల్లీ 12 పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకురాగా.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మయాంక్ అగర్వాల్‌కు దక్కింది.
స్కోర్‌బోర్డు..
పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రన్ (సి)స్మిత్ (బి)రబాడ 12, అగర్వాల్ (నాటౌట్) 99, గేల్ (బి)రబాడ 13, మలాన్ (బి)అక్షర్ 26, హుడా (రనౌట్) హెట్మెయిర్/అక్షర్ 1, షారుక్ ఖాన్ (సి)హెట్మెయిర్ (బి)ఆవేశ్ ఖాన్ 4, జోర్డాన్ (సి)లలిత్ (బి)రబాడ 2, హర్‌ప్రీత్ బ్రార్ (నాటౌట్) 4, అదనం 5. (20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి) 166 పరుగులు.
వికెట్ల పతనం: 1/17, 2/35, 3/87, 4/88, 5/143.
బౌలింగ్: ఇషాంత్ 4-1-37-0, స్టోయినీస్ 1-0-6-0, రబాడ 4-0-36-3, ఆవేశ్ ఖాన్ 4-0-39-1, లలిత్ యాదవ్ 3-0-25-0, అక్షర్ పటేల్ 4-0-21-1.
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా (సి)హర్‌ప్రీత్ బ్రార్ 39, ధావన్ (నాటౌట్) 69, స్మిత్ (సి)మలన్ (బి)మెరెడిత్ 24, పంత్ (సి)మయాంక్ (బి)జోర్డాన్ 14, హెట్మెయిర్ (నాటౌట్) 16, అదనం 5. (17.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి) 167 పరుగులు.
వికెట్ల పతనం: 1/63, 2/111, 3/147
బౌలింగ్: మెరెడిత్ 3.4-0-35-1, షమీ 3-0-37-0, బిష్ణోరు 4-0-42-0, జోర్డాన్ 2-0-21-1, హర్‌ప్రీత్ బ్రార్ 3-0-19-1, హుడా 2-0-11-0.