Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీ లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడ్డ సన్‌రైజర్స్
- రాజస్తాన్ చేతిలో 55 పరుగుల తేడాతో ఓటమి
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరో ఓటమిని చవిచూసింది. అరుణ్‌జైట్లీ మైదానంలో రాజస్తాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 55పరుగుల తేడాతో ఓడింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ను ఓపెనర్ బట్లర్(124; 64బంతుల్లో 11ఫోర్లు, 8సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కడంతో రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 165 పరుగులే చేయగల్గింది. దీంతో ప్లేఆఫ్ అవకాశాలను సన్‌రైజర్స్ సంక్లిష్టం చేసుకోగా.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బట్లర్‌కు దక్కింది.
తొలుత రాజస్థాన్‌ను యువ ఓపెనర్ జైస్వాల్(12) నిరాశపర్చినా.. జోస్ బట్లర్(124) సెంచరీతో కదం తొక్కాడు. మరో ఎండ్‌లో కెప్టెన్ సంజూ శాంసన్(48; 33బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు) సహకారం అందించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 150 పరుగులు జతచేశారు. బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. ఈ క్రమంలోనే 56 బంతుల్లో శతకం పూర్తి చేసి మరింత దూకుడు పెంచాడు. అయితే, సందీప్ శర్మ వేసిన 19వ ఓవర్లో చివరి బంతికి బౌల్డయ్యాడు. రియాన్ పరాగ్(15), డేవిడ్ మిల్లర్(7నాటౌట్)గా నిలిచారు. రషీద్, విజరు శంకర్, సందీప్ శర్మకు తలా ఒకవికెట్ దక్కాయి. భారీ లక్ష్య ఛేదనలో మనీశ్ పాండే(31; 20బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు), బెయిర్‌స్టో(30; 21బంతుల్లో 4ఫోర్లు, సిక్సర్), కెప్టెన్ కేన్ విలియమ్సన్(20) మాత్రమే రాణించారు. తొలి వికెట్‌కు మనీశ్, బెయిర్ స్టో కలిసి ఆరు ఓవర్లకే 57 పరుగులు జోడించి బలమైన పునాది వేసినా.. మిగిలిన బ్యాట్స్మెన్లు విఫలమవడంతో సన్‌రైజర్స్‌కు ఓటమి తప్పలేదు. చివర్లో భువనేశ్వర్ కుమార్(14), సందీప్(8నాటౌట్)గా నిలిచి జట్టును ఆలౌట్ కాకుండా అడ్డుకున్నారు. ముస్తాఫిజుర్, మోరిస్‌కు మూడేసి వికెట్లు, కార్తీక్ త్యాగి, తెవాతియాకు ఒక్కో వికెట్ దక్కాయి.
రాజస్తాన్ రాయల్స్: బట్లర్ (బి)సందీప్ శర్మ 124, జైస్వాల్ (ఎల్బి) రషీద్ 12, సంజు శాంసన్ (సి)సమద్ (బి)విజరు శంకర్ 48, రియాన్ పరాగ్ (నాటౌట్) 15, మిల్లర్ (నాటౌట్) 7, అదనం 14. (20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి) 220 పరుగులు.
వికెట్ల పతనం: 1/17, 2/167, 3/209
బౌలింగ్: భువనేశ్వర్ 4-0-37-0, సందీప్‌శర్మ 4-0-50-1, రషీద్ ఖాన్ 4-0-24-1, ఖలీల్ అహ్మద్ 4-0-41-0, విజరు శంకర్ 3-0-42-1, నబీ 1-0-21-0
సన్‌రైజర్స్ హైదరాబాద్: మనీష్ పాండే (బి)ముస్తఫిజుర్ 31, బెయిర్‌స్టో (సి)రావత్ (బి)తెవాటియా 30, విలియమ్సన్ (సి)మోరిస్ (బి)త్యాగీ 20, విజరు శంకర్ (సి)మిల్లర్ (బి)మోరిస్ 8, కేదర్ జాదవ్ (బి)మోరిస్ 19, నబీ (సి)రావత్ (బి)ముస్తఫిజుర్ 17, సమద్ (సి)రావత్ (బి)మోరిస్ 10, రషీద్ ఖాన్ (సి)మోరిస్ (బి)ముస్తఫిజుర్ 0, భువనేశ్వర్ (నాటౌట్) 14, సందీప్ శర్మ (నాటౌట్) 8, అదనం 8. (20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి) 165 పరుగులు.వికెట్ల పతనం: 1/57, 2/70, 3/85, 4/105, 5/127, 6/142, 7/142, 8/143.
బౌలింగ్: త్యాగీ 4-0-32-1, ముస్తఫిజుర్ 4-0-20-3, సకారియ 4-0-38-0, మోరిస్ 4-0-29-3, తెవాటియ 4-0-45-1.