Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొలంబో: శ్రీలంక ఆల్‌రౌండర్ తిసారా పెరీరా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. తిసారా తన రిటైర్మైంట్ నిర్ణయాన్ని శ్రీలంక క్రికెట్‌బోర్డు(ఎస్‌సిబి)కు సోమవారం తెలియజేశాడు. లంక సెలెక్షన్ కమిటీ సమావేశం గురువారం జరగనున్న నేపథ్యంలో తిసారా రిటైర్మెంట్ ప్రకటించడం విశేషం. 32ఏళ్ల పెరీరా లంక లీగ్‌లో మాత్రం కొనసాగుతానని తెలిపాడు. లంక తరఫున పెరీరా 166వన్డేలు, 84 టి20లు, 6టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఐపిఎల్‌లోనూ 37మ్యాచ్‌లు ఆడాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో శ్రీలంక అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా పెరీరా గుర్తింపు తెచ్చుకున్నాడు. శ్రీలంక తరఫున ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టి రికార్డు పెరీరా పేరిట ఉంది.