Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగు నగరాలు..మిగిలిన 31 మ్యాచ్‌లు
- బెంగళూరు,కోల్‌కతాలో ప్రతిరోజూ 10వేలకుపైగా కోవిడ్ కేసులు
బెంగళూరు: ఐపీఎల్ 2021 సీజన్ మరోసారి కరోనా వెంటాడుతోంది. ఈ సీజన్లో కేవలం 29 మ్యాచ్‌లు మాత్రమే ఆడారు. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కు చెందిన ఇద్దరు ఆటగాళ్లకు కరోనా సోకింది. కోల్‌కతా, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ (ఆర్సీబీ) మ్యాచ్‌లను ఐపీఎల్లో సోమవారం వాయిదా వేయాల్సి ఉంది. ఐపీఎల్ ఆరంభం నుంచి ఏడుగురు క్రికెటర్లకు కరోనా సంక్రమించింది.
ఈ టోర్నమెంట్లో ఫైనల్‌తో సహా ఇంకా 31 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. అహ్మదాబాద్, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతాలోని మ్యాచ్‌లు నిర్వహించాల్సి ఉన్నది. అయితే ఈ నగరాల్లో కరోనా తీవ్రతతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
బెంగళూరులో 15 ఏప్రిల్,కోల్‌కతాలో మే 21 వరకూ ప్రతిరోజూ 10 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక దేశరాజధాని ఢిల్లీలో ఆదివారం 20,394 కేసులు వచ్చాయి. అహమ్మదాబాద్‌లో ఏప్రిల్ 20 నుంచి ప్రతిరోజూ ఐదువేలకు పైగా కొత్తకేసులు నమోదవుతున్నాయి.
ఐపీఎల్ 2021 సీజన్లో మిగిలిన 31 మ్యాచ్‌ల క్రీడాస్థలాలు..
అహమ్మదాబాద్...ఫైనల్ సహ 7 మ్యాచ్‌లు
కోల్‌కతా,బెంగళూరు మధ్య సోమవారం మ్యాచ్ జరగాల్సిఉన్నది. దీన్ని వాయిదావేశాయి. మే 6న బెంగళూరు,పంజాబ్, మే 8న కోల్‌కతా,ఢిల్లీల మధ్య మ్యాచ్ నిర్వహించాల్సిఉన్నది.అదే నెల 25న ఫైనల్ మ్యాచ్ సహ ప్లేఆఫ్‌లు కూడా జరగాల్సి ఉన్నది. ప్రస్తుతం వందమంది క్రికెటర్ల శిబిరం ఉన్నది. కోల్‌కతాకు చెందిన ఇద్దరు ప్లేయర్లతో పాటు పంజాబ్ కింగ్స్‌కు చెందిన మరో ఆటగాడికి పాజిటివ్ వచ్చింది.
కరోనా తీవ్రత
అహమ్మదాబాద్‌లో ఏప్రిల్ 20 తర్వాత ప్రతిరోజూ ఐదువేల వరకు కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఏప్రిల్ 11 తర్వాత ప్రతిరోజూ 20 వేల పాజిటివ్ కేసులు వస్తున్నాయి. రోజూ 20మందికి పైగా కోవిడ్ పేషెంట్లు చనిపోతున్నారు. సరిగ్గా ఒకనెల కిందట ఏప్రిల్ 2న మొత్తం 73,875 కేసులు రాగా,మే 2 నాటికి 1.76 లక్షలకు చేరాయి. ఈ లెక్కన రోజు వారీ సంక్రమిస్తున్న కేసులు 238 శాతానికి రికార్డు స్థాయికి పెరిగాయి.
ఢిల్లీ..మిగిలిన నాలుగు మ్యాచ్‌లు
ఢిల్లీలో నాలుగు మ్యాచ్ ఆడారు. ఇంకా అన్ని మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.
నాలుగు టీమ్‌లైన హైదరాబాద్,ముంబయి,రాజస్థాన్,చెన్నైకి చెందిన ఆటగాళ్లు వందమంది దాకా ఉన్నారు.చెన్నైకు చెందిన బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ సహ ఇద్దరు స్టాఫ్‌కు కరోనా సోకింది.
ఢిల్లీలో కరోనా విజృంభణ
దేశరాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తున్నది. భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గత నెలతో సంక్రమించిన కేసులను పరిగణనలోకి తీసుకుంటే..178 శాతానికి కేసులు పెరిగాయి. ఢిల్లీలో పూర్తి లాక్డౌన్ కొనసాగుతున్నది.
బెంగళూరులో ఇంకా పది మ్యాచ్‌లు
బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. మే 9 నాలుగు టీములైన చెన్నై,పంజాబ్,ముంబయి, కోల్‌కతాల మధ్య పది మ్యాచ్‌లు ఆడాల్సిఉన్నది. ముందుగా చెన్నై,పంజాబ్‌ల మధ్య మ్యాచ్ ఆడాల్సి ఉన్నది.
బెంగళూరులో కోవిడ్ దడ
బెంగళూరులో ఏప్రిల్ 2 నుంచి 4.41లక్షలదాకా కరోనా కేసులు వచ్చాయి. ఇక్కడ 181 శాతానికి కేసులు పెరిగాయి. మరణాల సంఖ్య 6600లకు చేరుకున్నది.
కోల్‌కతాలో 10 మ్యాచ్‌లు
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. మే 9 నుంచి బెంగళూరు,హైదరాబాద్,ఢిల్లీ,రాజస్థాన్ల మధ్య పది మ్యాచ్‌లు ఆడాల్సిఉన్నది. తొలి మ్యాచ్ బెంగళూరు,హైదరాబాద్‌ల మధ్య ఆడాల్సి ఉన్నది.
కోల్‌కతా వైరస్ భయం
కోల్‌కతాలోనూ రోజువారీ కేసులను పరిశీలిస్తే 146 శాతానికి పెరిగాయి. రోజూ పదివేలకు పైగా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. ఎన్నికల ర్యాలీలు ముగియగానే లాక్డౌన్ విధించారు.
ఆటగాళ్లకు భద్రతా చర్యలు
అన్ని జట్లు వేర్వేరు హౌటళ్లలో ఉంటున్నాయి. హౌటల్‌లోని బయో బబుల్‌ను బీసీసీఐ మార్గదర్శకాల ప్రకారం ఏర్పాటు చేశారు. హౌటళ్లను కోవిడ్ కేంద్రాలుగా మార్చాలన్న ఢిల్లీ ప్రభుత్వ పాలన ప్రభావితం కాదు. ఆప్ సర్కార్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఆస్పత్రికి సమీపంలో ఉన్న హౌటళ్లను కోవిడ్ సెంటర్‌గా మార్చారు. అలాంటి పరిస్థితిలో ఫ్రాంఛైజీలు తమ పరిధిలోకి రాని హౌటళ్లలో ఉండటానికి ఏర్పాట్లు చేశారు. స్టేడియంలో 200 మందికి పైగా ఉండరు. స్టేడియంలో మూడు గ్రూపులు విభజించారు. జోన్ -1 లో ఆటగాళ్ళు , అధికారులు ఉంటారు. అక్కడికి వెళ్ళడానికి ఎవరినీ అనుమతించరు.
జోన్ -2 ప్రసార బృందానికి చెందిన వ్యక్తులు మాత్రమే ఉంటారు. ఎవర్ని ఇక్కడికి వెళ్లనీయరు.
జోన్ -3 లో బోర్డు అధికారులు మాత్రమే ఉంటారు. ఇవి కూడా జోన్ -1 , 2 దాటి అనుమతించరు.