Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బిఎఫ్ఐ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడి) రాజ్‌కుమార్ సచేటి(56) కరోనాతో మంగళవారం కన్నుమూశారు. కరోనాతో గత రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 2016లో సచేటి బాక్సింగ్ ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు అయ్యారు. ఒలింపిక్ టాస్కు ఫోర్సు సభ్యుడు కూడా అయిన సచేటి భారత బాక్సర్లు ఒలింపిక్ క్రీడల్లో సత్తా చాటేలా సమాయత్తపర్చారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అసోసియేట్ జాయింట్ సెక్రటరీ, మేఘాలయ నేషనల్ గేమ్స్(జిటిసిసి) ఛైర్మన్‌గానూ సచేటి పదవీ బాధ్యతల్లో కొనసాగారు. బిఎఫ్ఐ ఓ ప్రకటనలో భారత క్రీడాలోకానికి దక్షత గల నిర్వాహకుడిగా సచేటి సేవలందించారని పేర్కొనగా.. కేంద్ర క్రీడాశాఖమంత్రి కిరణ్ రిజుజు, ఐఓఏ సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా ఓ ప్రకటనలో సంతాపం తెలిపారు.