Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసిసి టి20 ర్యాంకింగ్స్ విడుదల
దుబాయ్: టి20 ర్యాంకింగ్స్‌లో భారతజట్టు మళ్ళీ రెండోస్థానానికి ఎగబాకింది. అంతర్జాతీయ క్రికెట్‌మండలి(ఐసిసి) మంగళవారం విడుదల చేసిన టి20 ర్యాంకింగ్స్‌లో భారత్ 272 పాయింట్లతో రెండోస్థానంలో నిలిచింది. ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టి20 సిరీస్‌ను టీమిండియా 3-2తో గెల్చుకోవడంతో ర్యాంకింగ్ మెరుగైంది. టాప్‌లో ఉన్న ఇంగ్లండ్ జట్టు ఇటీవల పాకిస్తాన్‌పై 1-1తో, ఆస్ట్రేలియా చేతిలో 2-1తో ఓడినా.. దక్షిణాఫ్రికాపై 3-0తో టి20 సిరీస్‌లను గెల్చుకోవడంతో అగ్రస్థానానికి ఢోకా లేకపోయింది. ఇక ఆస్ట్రేలియా జట్టు మూడో స్థానంనుంచి ఐదో స్థానానికి పడిపోగా.. న్యూజిలాండ్ ఐదో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. ఇంగ్లండ్(277), భారత్(272), న్యూజిలాండ్(263), పాకిస్తాన్(261), ఆస్ట్రేలియా(258)పాయింట్లతో టాప్-5లో కొనసాగుతున్నాయి.