Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు, ఆస్ట్రేలియా పేసర్ జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ తనవంతు సాయం ప్రకటించాడు. మంగళవారం ట్విటర్వేదికగా యూనిసెఫ్ ద్వారా భారత్‌కు సాయం అందించనున్నట్టు తెలిపాడు. చాలామంది క్రికెటర్లలాగే తనకూ ఇండియా అంటే అభిమానమనీ, ఇక్కడి ప్రజలు క్రికెట్‌ను ఎంతో ఆదరిస్తారనీ, భారత్‌లో క్రికెట్ ఆడటమంటే తనకు ఎంతో ఇష్టమని' ట్వీట్ చేశాడు. తనలాగే మరెంతోమంది ముందుకు రావాలనీ, తాను సాయం చేసేది కొద్ది మొత్తమేననీ, తనపైనా, తన కుటుంబంపైనా ఏండ్ల తరబడి చూపిస్తున్న ప్రేమాభిమానాలకు అది ఎంతమాత్రమూ సరిపోలదన్నాడు.
ఐపిఎల్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు బిసిసిఐ ప్రకటించిన కొద్దిసేపటికే బెహ్రెన్‌డార్ఫ్ తన నిర్ణయాన్ని తెలియజేశాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు పాట్ కమ్మిన్స్, బ్రెట్ లీ ఇప్పటికే తనవంతు సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే.