Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుబాయ్: ఏప్రిల్ నెలకు గాను 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డుకు పాకిస్థాన్ బ్యాట్స్మెన్లు బాబర్ అజమ్, ఫకార్ జమాన్తోపాటు శ్రీలంక సంచలనం కుశాల్ భుర్టెల్ చోటు దక్కించుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) బుధవారం ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు జాబితా రేసులో ఉన్న వారిని ప్రకటించింది. పురుషుల జాబితాలో దక్షిణాఫ్రికాతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్లో అద్బుత ప్రదర్శన చేసిన బాబర్, జమాన్ అవార్డుకు నామినేట్ అయ్యారు. అవార్డులు ప్రవేశపెట్టినప్పటి నుంచి ఏ ఒక్క భారత ఆటగాడికీ చోటు దక్కకపోవడం ఇదే తొలిసారి. మహిళల విభాగంలో ఆస్ట్రేలియా బ్యాట్స్వుమెన్లు అలీస్సా హీలీ, మెగన్ స్కట్, న్యూజిలాండ్ క్రీడాకారిణి కాస్పెర్క్ అవార్డుకు నామినేట్ అయ్యారు.