Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: భారత క్రికెట్ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) అవినీతి నిరోధకశాఖ ఇచ్చిన సమాచారం మేరకు ముంబయి పోలీసులు ముగ్గురు ఐపిఎల్ బుకీలను ఓ హోటల్లో బుధవారం అరెస్ట్ చేశారు. దక్షిణ ముంబయిలో ఓ ప్రముఖ హోటల్లో ఉన్న ప్రవేశ్ బఫ్నా, ఆయుషీ కేసార్కర్, చేతన్ సలేఛా మైదానంలో తేమ శాతం మార్పుకు గ్రౌండ్మన్లతో సంప్రదింపులకు ప్రయత్నిస్తున్నట్లు బిసిసిఐ అవినీతి నిరోధకశాఖ గుర్తించింది. ఇటీవల ముంబయి వేదికగా జరిగిన రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్‌కు సంబంధించి ఈ వ్యవహారం నడిచినట్లు బిసిసిఐ గుర్తించింది. వీరివద్దనుంచి రూ.97వేల నగదు, 8మొుబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌ట్యాప్‌తో పాటు లగ్జరీ కారును ముంబయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.