Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీసీ టెస్ట్ బ్యాట్స్మన్ల ర్యాకింగ్స్లో 6వ స్థానం
దుబాయ్: ఐసిసి టెస్ట్ బ్యాట్స్మన్ల జాబితాలో రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్మండలి(ఐసిసి) బుధవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్లో పంత్ 6వ స్థానంలో నిలిచాడు. 23ఏళ్లకే ఐసిసి ర్యాంకింగ్స్లో 6వ స్థానంలో నిలిచిన వికెట్ కీపర్, బ్యాట్స్మన్గా పంత్ ఈ ఘనత అందుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్లో పంత్(747 పాయింట్లు) ఒక స్థానం ఎగబాకి తన కెరీర్ బెస్ట్ సాధించాడు. ఇక కోహ్లి(814 పాయింట్లు) ఐదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. హెన్రీ నికోలస్, రోహిత్ శర్మతో కలిసి సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచారు. కేన్ విలియమ్సన్ 919 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. స్టీవ్ స్మిత్(891 పాయింట్లు) రెండో స్థానంలో.. మార్నస్ లబుషేన్(878 పాయింట్లు) మూడు, జో రూట్(831 పాయింట్లు) నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు.