Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీసీఐ
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) సీజన్-14 అర్ధాంతరంగా వాయిదా పడడంతో విదేశీ ఆటగాళ్ల చేరవేతపై భారత క్రికెట్కంట్రోల్ బోర్డు(బిసిసిఐ) దృష్టి సారించింది. భారత్‌నుంచి నేరుగా ఇతర దేశాలకు విమాన రాకపోకలపై నిషేధం ఉన్న నేపథ్యంలో మాల్దీవులు, శ్రీలంక మీదుగా ఆటగాళ్లను చేరవేసేందుకు ఆయా క్రికెట్ బోర్డులతో బిసిసిఐ చర్చలు జరుపుతోంది. ఐపిఎల్‌లో ఆడేందుకు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్తోపాటు వెస్టిండీస్, దక్షిణాఫ్రికాలనుంచి ఎక్కువసంఖ్యలో ఆటగాళ్లు వచ్చారు. ఇంగ్లండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికాలకు ఆటగాళ్లు నేరుగా వెళ్లే పరిస్థితి ఉండగా.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆటగాళ్ల చేరవేతే బిసిసిఐకి తొలనొప్పిగా మారింది. ఆస్ట్రేలియానుంచి ఆటగాళ్లతోపాటు కోచ్‌లు, అంపైర్లు, క్రీడా విశ్లేషకులు విచ్చేశారు.
రెండు మూడు రోజుల్లో ఛార్డర్డ్ ఫ్లైట్స్: సిఏ
రెండు, మూడు రోజుల్లో ఇరుదేశాల మధ్య చర్చలు కొలిక్కి వచ్చే అవకాశముందని క్రికెట్ ఆస్ట్రేలియా(సిఏ) బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో ఆటగాళ్లకు ప్రత్యేకంగా ఓ ఛార్టర్డ్ ఫ్లైట్‌ను ఏర్పాటు చేస్తామని, ఈ విషయమై బిసిసిఐ నిరంతరం ఆస్ట్రేలియా ప్రభుత్వంతో టచ్‌లో ఉందని, సిఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిక్ హోక్లే సిడ్నీలో మీడియాతో తెలిపారు. తాజాగా చెన్నై సూపర్‌కింగ్స్, ఆస్ట్రేలియా బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ కరోనా బారిన పడ్డాడు. దీంతో హస్సీ ఆస్ట్రేలియా ఆటగాళ్లతో కలిసి తమ దేశానికి తిరిగి వెళ్లేందుకు అవకాశం లేదు. ఈ క్రమంలో అతడు భారత్‌లోనే రెండు వారాలు క్వారంటైన్లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
న్యూజిలాండ్ క్రికెట్బోర్డుతోనూ చర్చలు..
భారత్‌లో ఐపిఎల్ ముగిసిన అనంతరం ఆటగాళ్లను క్షేమంగా తిరిగి పంపుతామని బిసిసిఐ హామీ ఇచ్చిందని న్యూజిలాండ్ క్రికెట్‌బోర్డు(ఎన్‌సిబి) బుధవారం స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారం ఐపిఎల్ జరిగి ఉంటే మే 30 తర్వాత న్యూజిలాండ్ క్రికెటర్లు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ ఆడేందుకు నేరుగా లండన్‌కు బయల్దేరి వెళ్లాల్సి ఉంది. ఫైనల్స్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్తోపాటు మరికొంతమంది కివీస్ ఆటగాళ్లు ఐపిఎల్‌కు విచ్చేశారు. వీరందరికీ వచ్చే నెలలో లండన్‌కు వెళ్లేందుకు విమాన టికెట్లను ఆ దేశ క్రికెట్‌బోర్డు ఇప్పటికే బుక్ చేసింది. ఇక ఐపిఎల్ అర్ధాంతరంగా వాయిదా పడడంతో ఆటగాళ్లంతా ఎప్పుడు తమ దేశానికి తిరిగి వెళ్తామనే ఆతృతతో ఉన్నట్లు క్రికెటర్ హీత్ మిల్స్ తెలిపాడు.