Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తల్లిని కోల్పోయిన రెండు వారాలకే మరో విషాదం
బెంగళూరు: భారతజట్టు మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి ఇంట మరో విషాదం నెలకొంది. కరోనాతో తల్లి మరణించి రెండు వారాలు గడవకముందే ఆ మహమ్మారికి ఆమె సోదరి కూడా మృతి చెందింది. ఏప్రిల్ 23న వేదా కృష్ణమూర్తి తల్లి చెలువాంబ దేవి(67) కరోనా బారిన పడి మృతి చెందింది. వేదా టెస్ట్ చేయించుకోగా నెగటివ్ రాగా.. ఆమె సోదరి వత్సల శివకుమార్(42) మాత్రం కరోనా సోకింది. దీంతో ఆమెను బెంగళూరుకు 245 కి.మీ. దూరంలోని చిక్మంగలూర్లోని ఆసుపత్రిలో చేర్పించారు. వత్సల ఈ మహమ్మారితో పోరాడుతూ గురువారం మృతిచెందినట్లు వేదా మాజీ కోచ్ ఇర్ఫాన్ సేట్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు.