Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా బారినపడిన చెన్నై సూపర్‌కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైకేల్ హస్సీ, బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీలను ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఢిల్లీ నుంచి చెన్నై తరలించారు. దీనిపై చెన్నై ఫ్రాంచైజీ అధికారి ఒకరు స్పందిస్తూ... తమకు చెన్నైలో పరిచయాలు ఎక్కువగా ఉన్నాయని, తద్వారా వారిద్దరికీ మరింత మెరుగైన వైద్య సేవలు అందించగలమని భావిస్తున్నామని తెలిపారు. హస్సీ, బాలాజీలకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవని, వారిద్దరూ ప్రస్తుతం బాగానే ఉన్నారని, ముందు జాగ్రత్తచర్యగానే వారిని చెన్నైకు తరలించినట్టు తెలిపారు. మైకేల్ హస్సీకి నెగెటివ్ రిపోర్టుకోసం ఎదురుచూస్తున్నామని, నెగెటివ్ వచ్చిన వెంటనే మాల్దీవుల్లో ఉన్న ఆస్ట్రేలియా ఆటగాళ్లవద్దకు పంపుతామన్నారు. విదేశీ ఆటగాళ్లు భారత్‌ను ఇతర దేశాలకు వెళ్ళేందుకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తున్నట్టు ఆ అధికారి తెలిపారు.