Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: టీమిండియా ఓపెనర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు శిఖర్ ధావన్ కరోనా వ్యాక్సిన్ తొలి డోస్‌ను గురువారం వేయించుకున్నాడు. సోషల్ మీడియా వేదికగా తాను తొలి డోస్ వేయించుకున్న విషయాన్ని తెలియజేస్తూ.. ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ను తప్పక వేయించుకోవాల్సిందిగా పిలుపిచ్చాడు. టీకా వేయించుకున్న అనంతరం గబ్బర్ స్పందిస్తూ.. 'వాక్సినేషన్ పూర్తైంది. త్యాగాలు చేస్తూ, అంకితభావంతో ముందు వరుసలో పోరాడుతున్న యోధులకు కేవలం ధన్యవాదాలు మాత్రమే చాలవు. ఏ మాత్రం వెనుకాడకుండా సాధ్యమైనంత త్వరగా మీరంతా టీకా వేయించుకోండి. వైరస్‌ను ఓడించేందుకు అది సాయపడుతుంది' అని ట్వీట్ చేశాడు.