Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిసిసిఐ అధ్యక్షుడు గంగూలీ
ముంబయి: ఇండియన్ ప్రిమియర్‌లీగ్(ఐపిఎల్)లో బయోబబుల్ ఎలా బ్రేక్ అయ్యిందో అర్థం కావడం లేదని బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఐపిఎల్ వాయిదా పడిన అనంతరం తొలిసారి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బయో బబుల్ ఎలా బలహీనంగా మారిందో అర్థం కావడం లేదని, బహుశా ప్రయాణాలే కారణం కావొచ్చని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నాడు. ఐపిఎల్ నిర్వహించాలని మేం అనుకున్నప్పుడు కోవిడ్ విజృంభణ ఈస్థాయిలో లేదు. ఇప్పుడు ఎవరు ఎన్నైనా చెబుతారు. కానీ, మేం మొదలుపెట్టినపుడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదన్నాడు. ఐసిసి టి20 ప్రపంచకప్‌ను దుబారులో నిర్వహిస్తారా? అని అడగ్గా.. దాని గురించి ఇప్పుడే మాట్లాడడం కష్టం. ఇంకా చాలా సమయం ఉంది. ఐసిసి టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మాత్రం షెడ్యూల్ ప్రకారమే ఇంగ్లండ్‌లో జరుగుతున్నాడు. భారత ఆటగాళ్లు ఇంగ్లండ్‌లో వారం రోజులు క్వారంటైన్లో ఉండి మ్యాచ్ ఆడతారని గంగూలీ స్పష్టం చేశాడు.
నివేదిక ప్రకారం బయోబబుల్ ఉల్లంఘన లేదు
ఆటగాళ్లకు పాజిటివ్ రావడంపై స్పందిస్తూ.. ''బయోబబుల్‌లో ఎటువంటి ఉల్లంఘన జరగలేదని మాకు నివేదిక అందింది. అయినా ఆటగాళ్లకు పాజిటివ్ ఎలా వచ్చిందో తెలియడం లేదు. బిసిసిఐ ఇంత పక్కాగా చర్యలు చేపట్టినా ఆటగాళ్లకు ఎలా వైరస్ సోకిందని చెప్పడం కూడా కష్టమే'' అని పేర్కొన్నారు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన అమిత్ మిశ్రా, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన వృద్ధిమాన్ సాహాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ తర్వాత ఐపిఎల్ వాయిదా ప్రకటన వచ్చిందని, మే 30వరకు జరగాల్సిన 60మ్యాచ్‌ల టోర్నమెంట్లో కేవలం 29 మ్యాచ్‌లు మాత్రమే జరిగాయన్నారు.