Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌కు భారత రోయింగ్ బృందం అర్హత సాధించింది. పురుషుల లైట్ వెయిట్ డబుల్ స్కల్స్కు అర్జున్‌లాల్, అరవింద్ సింగ్ క్వాలిఫై అయ్యారు. శుక్రవారం రాత్రి జరిగిన ఆసియా-ఓసియానియా కాంటినెంటల్ క్వాలిఫయింగ్ రెగట్టా ఫైనల్లో భారత రోవర్లు రెండోస్థానంలో నిలిచి ఈ ఫీట్‌ను అందుకున్నారు. సింగిల్స్‌లో భారత్‌కు చెందిన జకర్ ఖాన్ నాల్గో స్థానంలో నిలిచి తృటిలో అవకాశాన్ని కోల్పోయాడు. సింగిల్స్‌లో టాప్-3 స్థానాల్లో నిలిచిన వారికి మాత్రమే టోక్యో బెర్త్ దక్కనుంది. ఈ పోటీల్లో భారత్‌కు చెందిన 14మంది రోయింగ్ జట్టు టోక్యో బెర్త్‌లకు పోటీపడింది.
రెజ్లింగ్‌లో సుమిత్ కూడా..
భారత సీనియర్ రెజ్లర్ సుమిత్ మాలిక్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. బల్గేరియాలోని సోఫియాలో జరుగుతున్న ఒలింపిక్స్ అర్హత రెజ్లింగ్ పోటీ 125కిలోల ఫ్రిస్టైల్ విభాగంలో 28ఏళ్ల సుమిత్‌కు టోక్యో బెర్త్ దక్కింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్ పోటీలో మాలిక్ 2-2 పాయింట్లతో కజకిస్తాన్‌కు చెందిన అలెగ్జాండర్‌తో సమంగా నిలిచి.. సెమీస్‌లో తజకిస్తాన్‌కు చెందిన రుస్తమ్ చేతిలో 5-10పాయింట్ల తేడాతో ఓడాడు. లీగ్‌లో సాధించిన పాయింట్ల ఆధారంగా సుమిత్ సెమీస్‌కు అర్హత సాధించాడు. తొలిరౌండ్లో 9-6, రెండోరౌండ్లో 5-0పాయింట్లతో సుమిత్ నెగ్గాడు. అమిత్ థంకర్(74కిలోలు), సత్యవత్ కడియన్(97కిలోలు) నిరాశపరిచారు.