Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మలేషియా ఓపెన్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ వాయిదాపడింది. టోక్యో బెర్త్‌లే లక్ష్యంగా జరగాల్సిన మలేషియా ఓపెన్‌ను కోవిడ్-19 కారణంగా వాయిదా చేస్తున్నట్లు నిర్వాహకులు శుక్రవారం ప్రకటించారు. ఈ టోర్నమెంట్‌ను వాయిదా వేస్తున్నట్లు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా, ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్యలు సంయుక్తంగా తెలిపాయి. షెడ్యూల్ ప్రకారం టోర్నీ మే 25నుంచి 30వరకు మలేషియా వేదికగా కౌలాలంపూర్‌లో జరగాల్సి ఉంది. దీంతో జూన్ 1నుంచి ప్రారంభం కానున్న సింగపూర్ ఓపెన్‌పైనే భారత షట్లర్లు దృష్టి పెట్టారు. సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్‌తోపాటు డబుల్స్‌లో పొన్నప్ప-సిక్కిరెడ్డి టోక్యో రేసులో ఉన్నారు.