Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుల్దీప్, సైనీలకు నిరాశ ొస్టాండ్బైగా నలుగురు
- ఇంగ్లండ్, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్‌కు జట్టు ప్రకటన
ముంబయి: ఇంగ్లండ్ టూర్‌కు బయల్దేరే భారత జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బిసిసిఐ) శుక్రవారం ప్రకటించింది. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్కుముందు భారతజట్టు తొలుత న్యూజిలాండ్‌తో ఐసిసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్‌ను ఆడనుంది. బిసిసిఐ సెలెక్షన్ కమిటీ ఇంగ్లండ్ టూర్‌కు ప్రకటించిన జట్టులో రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, హనుమ విహారి తిరిగి చోటు దక్కించుకోగా.. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, పేసర్ నవ్‌దీప్ సైనీ చోటు కోల్పోయారు. ఇక స్టాండ్‌బై ఆటగాళ్లుగా అభిమన్యు ఈశ్వరన్, ప్రసిధ్ కృష్ణ, ఆవేశ్ ఖాన్, అర్జాన్ నాగ్వాస్వాల్లా ఇంగ్లండ్‌కు బయల్దేరి వెళ్లనున్నారు. అలాగే సర్జరీ చేయించుకున్న కేఎల్ రాహుల్, కరోనాతో బాధపడుతున్న వృద్ధిమాన్ సాహా ఫిట్నెస్ నిరూపించుకుంటే ఆ తర్వాత ఇంగ్లండ్‌కు బయల్దేరి వెళ్లనున్నారు. న్యూజిలాండ్‌తో ఐసిసి టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ జూన్ 18-22న సౌథాంప్టన్ వేదికగా జరగనుండగా.. అనంతరం ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది.
భారత జట్టు: కోహ్లి(కెప్టెన్), రహానే(వైస్ కెప్టెన్), రోహిత్, శుభ్‌మన్, అగర్వాల్, పుజరా, విహారి, పంత్(వికెట్ కీపర్), అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, సుందర్, బుమ్రా, ఇషాంత్, షమీ, సిరాజ్, శార్దూల్, ఉమేష్. స్టాండ్‌బై ప్లేయర్స్: ఈశ్వరన్, ప్రసిధ్ కృష్ణ, ఆవేశ్ ఖాన్, అర్జాన్ నాగ్వాస్వాల్లా.