Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 25నుంచి 8రోజులు బబుల్
- జూన్ 2నుంచి 10రోజులు క్వారంటైన్
- ఇంగ్లండ్ టూర్‌కు కుటుంబ సభ్యులకూ అనుమతి
ముంబయి:2తర్వాత 10రోజులు క్వారంటైన్లో తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుందని బిసిసిఐ శనివారం వెల్లడించింది. బిసిసిఐ అధికారి ఒకరు మాట్లాడుతూ.. భారత్‌ను వీరంతా నేరుగా చార్టర్డ్ ఫ్లైట్‌లో వెళ్తారు కాబట్టి.. అక్కడ క్వారంటైన్లో ఉంటూనే ప్రాక్టీస్ చేసే అవకాశముందని, బబుల్, క్వారంటైన్ కాలంలో ఎప్పటికప్పుడు కరోనా టెస్టులకూ హాజరుకావాల్సి ఉంటుందన్నారు. అలాగే ఆటగాళ్లు తమ వెంట కుటుంబ సభ్యులను కూడా తీసుకెళ్లే అవకాశం బిసిసిఐ కల్పించిందని, డబ్ల్యూటిసి ఫైనల్‌కు, ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి రెండు వారాల సమయం మిగిలి ఉండడంతో ఆటగాళ్లంతా జాగ్రత్తగా ఉండాలని బిసిసిఐ సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే ఆటగాళ్లకు వ్యాక్సినేషన్ వేయడం కూడా చాలా ముఖ్యమని, తొలి డోసు ఇక్కడ వేయించుకుంటే.. రెండో డోసును ఇంగ్లండ్‌లో వేయించే అంశంపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డుతో బిసిసిఐ చర్చలు జరుపుతోందని ఆ అధికారి చెప్పారు. ఈ టూర్లో భాగంగా టీమిండియా జూన్ 18నుంచి సౌథాంప్టన్ వేదికగా తొలుత న్యూజిలాండ్‌తో ఐసిసి ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఆడనుండనుం డగా.. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆగస్టు 4నుంచి ప్రారంభం కానుంది.