Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆక్లాండ్: ఐపిఎల్ వాయిదాతో తిరుగు పయనమైన న్యూజిలాండ్ క్రికెటర్లు క్షేమంగా స్వదేశం చేరుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, కోల్‌కతా నైట్‌రైడర్స్ హెడ్‌కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్తో పాటు ఫెర్గ్యుసన్, అంపైర్ క్రిస్ గఫానీ, కామెంటేటర్లు సైమన్ డౌల్, స్కాట్ స్టయిరిస్ బృందం టోక్యో మీదుగా ఆదివారం ఆక్లాండ్‌కు చేరుకున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్‌బోర్డు ఆదివారం తెలిపింది. ఇక పేసర్ ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ మిల్నే, ఫిన్ అలెన్, జిమ్మీ నీషమ్‌లు శనివారమే రాగా.. కరోనా సోకిన కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాట్స్‌మన్ టిమ్ సీఫర్ట్‌కు భారత్‌లోనే ఉన్నాడు.