Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: రెజ్లర్ సాగర్ ధన్కడ్(37) హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశీల్ కుమార్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. సాగర్ ధన్కడ్ మంగళవారం హత్యకు గురికాగా.. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదైన సుశీల్ కోసం ఢిల్లీ పోలీసులు గాలిస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశంలో ఉన్న భక్తు, రవీందర్లనుంచి పోలీసులు శనివారం వాంగ్మూలాలను, సిసిటిపి ఫుటేజ్‌ను పోలీసులు సేకరించారు. ఛత్రసాల్ స్టేడియంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో సాగర్ ధన్కడ్ మరణించిన విషయం తెలిసిందే. ఘర్షణ జరిగిన ప్రదేశంలో సుశీల్‌తోపాటు అతని స్నేహితుడు సోను ఉన్నట్లు.. ఘర్షణ అనంతరం అమిత్ కారులో వీరంతా తప్పించుకొని పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు.