Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ అథ్లెటిక్ చీఫ్ సెబాస్టియన్ పిలుపు
టోక్యో: ఒలింపిక్స్ షెడ్యూల్ ప్రకారమే జరగనున్నాయని, ఈ విషయంలో అథ్లెట్లు ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదని ప్రపంచ అథ్లెటిక్ చీఫ్, ఐఓసి మెంబర్ సెబాస్టియన్ ఆదివారం పిలుపిచ్చారు. 1.4బిలియన్ డాలర్లతో నూతనంగా జపాన్‌లో నిర్మించిన నేషనల్ స్టేడియం లోపల సెబాస్టియన్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒలింపిక్స్‌కు కేవలం 11 వారాల సమయం మాత్రమే మిగిలి ఉందని, ఒలింపిక్స్ వాయిదా, రద్దుపై వస్తున్న పుకార్లను పూర్తిగా కొట్టిపారేశారు. అలాగే సుమారు 420మంది అథ్లెట్లతో ఆదివారం టెస్ట్ రన్‌ను నిర్వహించగా.. 9మంది విదేశీ అథ్లెట్లు ఇందులో ప్రాతినిధ్యం వహించారు. ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో పాల్గొనేందుకు సుమారు 10వేలకు పైగా అథ్లెట్లు పాల్గొనే అవకాశముందని, అధికారులు, జడ్జిలు, మీడియా బ్రాడ్క్టాసర్స్ ఎక్కువసంఖ్యలో జపాన్‌కు రానున్నారని ఆయన తెలిపారు. ఇక స్టేడియం బయట ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దని, ఒలింపిక్స్‌ను వెంటనే రద్దు చేయాలని ఫ్లకార్డులు బూని కొంతమంది నిరసన తెలపడం విశేషం.