Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పాన్సర్లు, ప్రకటనకర్తలకు అండగా
- మ్యాచ్‌కు రూ.54.5కోట్లు
- 29మ్యాచ్‌లకు రూ.1,580కోట్లే చెల్లించండి
ముంబయి: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) సీజన్-14 వాయిదాతో స్పాన్సర్లు, ప్రకటనకర్తలకు అండగా స్టార్ ఇండియా నిలిచింది. 2018-2022 ఐదు సంవత్సరాలకుగాను స్టార్ స్పోర్ట్స్ ఛానల్.. ఐపిఎల్ టివి, డిజిటల్ ప్రసార హక్కులను రూ.16,348 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే ఒక్కో మ్యాచ్‌కు బిసిసిఐకి రూ.54.5కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. మ్యాచ్‌లు జరిగేటప్పుడు విరామ సమయాల్లో ప్రకటనల కోసం స్టార్ ఇండియా.. పలు బ్రాండ్లు, స్పాన్సర్లకు టైమ్‌స్లాట్‌లను పెద్ద మొత్తంలో అమ్ముకుంది. ఇక ఈ సీజన్లో మొత్తం 60 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. 29 మ్యాచ్‌ల అనంతరం ఐపిఎల్ టోర్నీ వాయిదా పడింది. ఇంకా 31 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఐపిఎల్ ప్రారంభం కావడంతో సీజన్ మొత్తానికి ఒప్పందం కుదుర్చుకున్న ప్రకటనకర్తలు, స్పాన్సర్లు భారీ ఎత్తున నష్టపోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే స్పందించిన స్టార్ యాజమాన్యం.. ఆయా స్పాన్సర్లు, ప్రకటనకర్తలను ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల వరకే డబ్బులు చెల్లించాలని కోరింది. మిగతా వాటికి.. బిసిసిఐ తిరిగి ఎప్పుడు మ్యాచ్‌లను కొనసాగిస్తుందో అప్పుడు చెల్లించాలని శనివారం స్పష్టం చేసింది.
బిసిసిఐకి రూ.2,500కోట్లు నష్టం?
కరోనా మహమ్మారి కారణంగా సీజన్-14 ఐపిఎల్ వాయిదా పడడంతో బిసిసిఐకి సుమారు రూ.2,500 కోట్ల నష్టం వాటిల్లనుంది. కోవిడ్‌వల్ల లీగ్ వాయిదా నిర్ణయాన్ని ఐపిఎల్ ప్రసారదారు స్టార్‌స్పోర్ట్స్ సమర్ధించినా.. వాయిదా వల్ల స్టార్‌స్పోర్ట్స్ నుంచి వచ్చే ఆదాయాన్ని బిసిసిఐ కోల్పోవాల్సి వచ్చింది.
ఐపిఎల్ 2021 కోసం ఆయా కేటగిరీల్లో 18స్పాన్సర్లు ఉండగా, మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేసే ఒటిటి ప్లాట్‌ఫామ్ డిస్నీహాట్స్టార్కు 14మంది స్పాన్సర్లు ఉన్నారు. ప్రస్తుత సీజన్ మే 30వరకు ఆడితే 60 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. వాయిదా కారణంగా కేవలం 29మ్యాచ్‌లు జరిగాయి. మరో 31 మ్యాచ్‌లు వాయిదా పడడంతో బిసిసిఐ రాబడికి గండి పడినట్లైంది.