Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాడ్రిడ్: ప్రతిష్ఠాత్మక మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టైటిల్‌ను అలెగ్జాండర్ జ్వెరేవ్(జర్మనీ) రెండోసారి చేజిక్కించుకున్నాడు. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో జ్వెరేవ్ 6-7(8-10), 6-4, 6-3తో బెర్రెట్టిని (ఇటలీ)పై చెమటోడ్చి నెగ్గాడు. తొలి సెట్‌ను టై బ్రేక్‌లో కోల్పోయిన అనంతరం తర్వాతి రెండు సెట్లను జ్వెరేవ్ అలవోకగా గెలుచుకున్నాడు. ఇప్పటి వరకు మొత్తం నాలుగో ఏటిపి మాస్టర్స్ ట్రోఫీలను గెలుపొందాడు. టైటిల్‌ను గెలిచే క్రమంలో జ్వెరేవ్.. రఫెల్ నాదల్, డోమినిక్ థీమ్‌లను ఓడించాడు. జ్వెరేవ్ ఓ టోర్నమెంట్లో టైటిల్ నెగ్గే క్రమంలో ముగ్గురు టాప్-10 ఆటగాళ్లపై విజయం సాధించడం ఇది రెండవసారి మాత్రమే. ఇక మహిళల సింగిల్స్ టైటిల్‌ను సబలెంకో(బెలారస్) 6-0, 3-6, 6-4తో టాప్‌సీడ్ బార్టీ(ఆస్ట్రేలియా)ను ఓడించిన సంగతి తెలిసిందే.