Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిషికోరి, ఒసాకా
టోక్యో: ఒలింపిక్స్‌ను సురక్షితంగా నిర్వహించగలమో, లేదో? నిర్వాహకులు మరోసారి పరిశీలించాలని జపాన్ టెన్నిస్ స్టార్స్ నిషికోరి, నవోమి ఒసాకా అన్నారు. జపాన్‌లో కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చడంతో ఇక్కడి ప్రభుత్వం శుక్రవారం వరకు లాక్‌డౌన్‌ను పొడిగించిందని, ఈ క్రమంలో విశ్వ క్రీడలను నిర్వహించి తీరుతామని నిర్వాహకులు ప్రకటిస్తుండగా.. మరోవైపు వాయిదావేయమని ఆందోళనలు జరుగుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇతర దేశాలతోనూ చర్చించి ప్రస్తుత పరిస్థితుల్లో ఒలింపిక్స్ సాధ్యమో? కాదో? తేల్చి చెప్పాల్సిన అవసరముందన్నారు. ఒసాకా ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఒలింపిక్స్‌పై 'తప్పక చర్చ జరగాల్సిన అవసరం ఉంది' అని పేర్కొనగా.. మాజీ నంబర్‌వన్ ఆటగాడు నిషికోరి మాత్రం ప్రేక్షకుల్లేకుండా తలుపులు మూసేసి ఒలింపిక్స్ నిర్వహించడం కూడా కష్టంతో కూడుకున్నదేనన్నాడు. ప్రపంచవ్యాప్తంగా అథ్లెట్లు అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు కాబట్టి వైరస్ వ్యాప్తి చెందే అవకాశముందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.