Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: కరోనా మహమ్మారిపై పోరాటానికి మద్దతుగా ఐపిఎల్ ఫ్రాంఛైజి సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ విరాళాన్ని ప్రకటించింది. ట్విటర్వేదికగా సోమవారం కోవిడ్ సెకండ్ వేవ్‌తో ఇబ్బందిపడుతున్న వారిని ఆదుకునేందుకు రూ.30కోట్లు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. వివిధ స్వచ్ఛంద సంస్థలతో పాటు కేంద్ర, రాష్ఱ ప్రభుత్వాలు చేపడుతున్న కోవిడ్-19 సహాయక చర్యలకు ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపింది. ఐపిఎల్‌లో పాల్గొన్న ఆటగాళ్లు తమవంతు సాయాన్ని ప్రకటిస్తుండగా.. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యాలు ఆర్థిక సాయంతో పాటు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, మెడికల్ కిట్లను డొనేట్ చేసిన సంగతి తెలిసిందే.