Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హరారే: జింబాబ్వేతో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌ను పాకిస్తాన్ గెల్చుకుంది. ఓవర్‌నైట్ స్కోర్ 9 వికెట్ల నష్టానికి 220పరుగులతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన జింబాబ్వే మరో 11 పరుగులు జతచేసి 231 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ లూక్ జాంగ్వే(37) వికెట్‌ను మహ్మద్ రిజ్వాన్ తీసుకోవడంతో జింబాబ్వే ఇన్నింగ్స్ కేవలం 20 నిమిషాల్లోనే ముగిసింది. షాహిన్ అఫ్రిది(5/52) కెరీర్ బెస్ట్ బౌలింగ్ నమోదు చేయడంతో పాక్ ఈ టెస్ట్‌ను ఇన్నింగ్స్ 147 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అబిద్ అలీకి, సిరీస్ హసన్ అలీకి దక్కాయి. దీంతో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను పాకిస్తాన్ 2-0తో కైవసం చేసుకుంది.
ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా బాబర్
కెప్టెన్ బాబర్ అజామ్ ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్(ఏప్రిల్-2021) అవార్డు గెలుచుకున్నాడు. ఇక మహిళల విభాగంలో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలీసా హీలీ కూడా ఈ అవార్డును గెల్చుకుంది. ఏప్రిల్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసినందుకుగాను వీరిద్దరికీ అవార్డులు దక్కినట్లు ఐసిసి సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. బాబర్ ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో భాగంగా మూడో వన్డేలో 82బంతుల్లో 94పరుగులు చేసి సిరీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఐసిసి బ్యాట్స్మన్ల జాబితాలో 13పాయింట్లు సాధించి మొత్తం 865పాయింట్లతో కెరీర్ బెస్ట్ సాధించాడు.