Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టోక్యో: హిరోషిమా నగరంలో టార్చ్‌లైట్ ర్యాలీ నిర్వహణ రద్దు అయ్యింది. హిరోషిమా గవర్నర్ హిడేహికో యుజాకి మంగళవారం ఓ ప్రకటనలో కోవిడ్ సెకండ్ వేవ్ దృష్ట్యా ఒలింపిక్స్ టార్చ్ ర్యాలీ రిలేకు అనుమతివ్వడం లేదని పేర్కొంది. హిరోషిమా నగరంలోని ఆరుచోట్ల వచ్చే వారంలో టార్చ్ర్యాలీ జరగాల్సి ఉందని, ముందస్తు జాగ్రత్తగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఒలింపిక్స్ ప్రారంభానికి 10వారాల సమయం మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఓ నగరంలో రిలే ర్యాలీకి నిరాకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మార్చి 25న ప్రారంభమైన టార్చ్‌లైట్ రిలే ర్యాలీ జపాన్‌లోని అన్ని నగరాల్లో తిరిగి జులై 23న టోక్యోలో ఒలింపిక్స్ ప్రారంభోత్సవాల సమయానికి స్టేడియంకు తిరిగి రావాల్సి ఉంది. స్థానిక పత్రిక క్యోడో న్యూస్ కథనం ప్రకారం ఒలింపిక్స్ టార్చ్‌లైట్ ర్యాలీ స్థానిక ప్రజలకు దూరంగా జరుగుతున్నట్లు ప్రచురించింది.