Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా, వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్ కోవిడ్ వ్యాక్సిన్ తొలి డోస్‌ను వేయించుకున్నాడు. వ్యాక్సిన్ వేయించుకుంటున్న ఫొటోను బుమ్రా మంగళవారం ట్విటర్లో షేర్ చేస్తూ.. 'టీకా వేయించుకున్నాను. దయచేసి అందరూ సురక్షితంగా ఉండాలని' తెలిపాడు. దినేశ్ కార్తీక్ కూడా తాను కోవిడ్ తొలిడోస్ వేయించుకుంటున్న ఫొటోను షేర్ చేస్తూ.. 'అందరూ సురక్షితంగా ఉండాలి, వైరస్ డోస్‌లను తప్పక వేయించుకోవాలి' అని పిలుపిచ్చాడు. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లడానికి ముందు భారత్‌లోనే కోవీషీల్డ్ టీకా వేయించుకోవాలని ఆటగాళ్లందరికీ బిసిసిఐ సూచించిన సంగతి తెలిసిందే.