Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విరాట్,అనుష్క క్యాంపెన్కు వచ్చిన విరాళాలు
- వచ్చే రెండ్రోజుల్లో రూ.1.78 కోట్లు వసూలు లక్ష్యం
న్యూఢిల్లీ. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ ప్రారంభించిన నిధుల సేకరణలో భాగంగా రూ.5 కోట్లు వసూలయ్యాయి. 'ఇన్ దిస్ టుగెదర్' అనే ఈ క్యాంపెన్లో క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఏడు రోజుల్లో రూ.7 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏడో తేది నుంచి ఇప్పటివరకు.. ఐదు రోజుల్లో రూ.5.22 కోట్లు వచ్చాయి. విరాట్, అనుష్క ఇద్దరూ దీనికి 2 కోట్లు విరాళామిచ్చారు. డిపాజిట్ మొత్తాన్ని యాక్ట్ గ్రాంట్లకు కేటాయించనున్నారు. ఈ నిధులతో అవసరమైనవారికి ఆక్సిజన్, వైద్య పరికరాలు, టీకా ఇతర వైద్యసేవలు అందించనున్నారు.