Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: అర్జున అవార్డు గ్రహీత, మూడుసార్లు జాతీయ టేబుల్ టెన్నిస్(టిటి) ఛాంపియన్ వేణుగోపాల్ చంద్రశేఖర్(64) బుధవారం కన్నుమూశారు. కోవిడ్ సోకిన చంద్రశేఖర్ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. చంద్రశేఖర్ తమిజగ టిటి అసోసియేషన్‌కు డైరెక్టర్, హెడ్‌కోచ్‌గా ఉండి చెన్నైలో ఎస్డిఎటి మెడిమిక్స్లో టిటి అకాడమీని నెలకొల్పారు. 1982 కామన్వెల్త్ గేమ్స్‌లో సెమీఫైనల్ చేరడమే చంద్రశేఖర్ ఉత్తమ ప్రదర్శన. బిఏ(ఎకనమిక్స్)లో గోల్డ్‌మెడలిస్ట్ అయిన చంద్రశేఖర్.. ప్రస్తుత టిటి స్టార్స్ సాథియాన్, ఎస్ రామన్, శరత్ కమల్.. చంద్రశేఖర్‌లను తీర్చిదిద్దారు. టేబుల్ టెన్నిస్ క్రీడ ఉత్తమ గురువును, కోచ్‌ను కోల్పోయిందని, 80వ దశకంలో టిటికి పేరు తెచ్చిన చంద్రశేఖర్‌ను మరువలేమని శరత్ కమల్ ట్వీట్లో పేర్కొన్నాడు.
ఆర్పీ సింగ్ తండ్రి కన్నుమూత
టీమిండియా మాజీ పేసర్ ఆర్పీ సింగ్ తండ్రి శివప్రసాద్ సింగ్ కరోనా వైరస్‌తో బుధవారం కన్నుమూశారు. తండ్రి మతి విషయాన్ని ఆర్పీ సింగ్ బుధవారం ట్విటర్ వేదికగా తెలిపాడు. 'నా తండ్రి శివప్రసాద్ సింగ్ కోవిడ్‌తో బాధపడుతూ నేడు మమ్మల్ని వదిలివెళ్ళారు.. ఆర్ఐపీ పాపా' అంటూ సింగ్ ట్వీట్ చేశాడు. ఆర్పీ సింగ్ 2018లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు. పియూష్ చావ్లా తండ్రి ప్రమోద్ కుమార్(60) కూడా కరోనాతో మరణించిన విషయం తెలిసిందే.