Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-సైనా, శ్రీకాంత్
- టోక్యో బెర్త్్లు కష్టమే
న్యూఢిల్లీ: సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ రద్దు అయితే సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ ఒలిం పిక్స్‌లో ఆడే అవకాశాన్ని కోల్పో నున్నారు. ఇదే జరిగితే పివి సింధు, బి. సాయిప్రణీత్‌తో పాటు పురుషుల డబుల్స్‌లో చిరాగ్ శెట్టి-రంకిరెడ్డి సాత్విక్సాయిరాజ్లకు మాత్రమే టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌లు దక్కనున్నాయి. ఒలింపిక్స్ అర్హతగా జరగాల్సిన ఇండియా ఓపెన్, మలేషియా ఓపెన్లు కోవిడ్-19 కారణంగా ఇప్పటికే రద్దు అయ్యాయి. ఆఖరి అవకాశంగా ఉన్న సింగపూర్ ఓపెన్‌పై ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య(బిడబ్ల్యుఎఫ్) బుధవారం వర్చ్యువల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. షెడ్యూల్ ప్రకారం గత నెలలో జరగాల్సిన టోర్నమెంట్‌ను బిడబ్ల్యుఎఫ్ రీ షెడ్యూల్ చేసింది. రీషెడ్యూల్ ప్రకారం ఈ టోర్నమెంట్ జూన్ 15నుంచి జరగాల్సి ఉండగా.. కోవిడ్-19 ఉధృతి నేపథ్యంలో టోర్నమెంట్ జరగడం కష్టంగా మారింది. మరోసారి దఫా వాయిదా వేసేందుకు బిడబ్ల్యుఎఫ్ అంగీకరించకపోవడంతో ర్యాంకింగ్స్ ఆధారంగా టోక్యో బెర్త్‌లను ఖరారు చేయాల్సి ఉంటుంది.