Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర క్రీడలమంత్రి కిరణ్ రిజిజు
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో మృతిచెందిన హాకీ ఆటగాళ్ల కుటుంబాలకు కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజుజు గురువారం పరిహారం ప్రకటించారు. ఇటీవల కోవిడ్-19తో ఇద్దరు హాకీ మరణించగా.. వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు. రిజిజు ట్విట్టర్ వేదికగా.. 'మేము కోవిడ్‌తో ఇద్దరు గొప్ప హాకీ ఆటగాళ్లను కోల్పోయాం. భారత హాకీ క్రీడకు ఎంకే కౌశిక్, రవీంద్రపాల్ సింగ్ చేసిన సేవలు గుర్తుండిపోతాయి' అని పోస్ట్ చేశారు. కోవిడ్‌తో ఇటీవలే ఎంకే కౌశిక్, రవింద్రపాల్ సింగ్ మృతి చెందగా.. వీరిద్దరూ 1980 ఒలింపిక్స్‌లో భారత హాకీజట్టు స్వర్ణ పతకం గెల్చిన జట్టులో సభ్యులు.