Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ యువ సంచలనం షెఫాలీ వర్మ, రాధా యాదవ్ ఆస్ట్రేలియా వేదికగా జరిగే మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో అరంగేట్రం చేయనున్నారు. 17ఏళ్ల విధ్వంస బ్యాట్‌వుమన్ షెఫాలీ వర్మ, ఎడమచేతివాటం స్పిన్నర్ రాధా యాదవ్ సిడ్నీ సిక్సర్స్ తరఫున ఆడనున్నారు. వీరిద్దరూ బిగ్‌బాష్ లీగ్‌లో ఆడే విషయాన్ని బిసిసిఐ, సిడ్నీ సిక్సర్స్ ఫ్రాంచైజీ గురువారం అధికారికంగా ధృవీకరించాయి. ఇక హర్మన్ ప్రీత్ కౌర్(సిడ్నీ థండర్స్), స్మృతి మంధాన(బ్రిస్బేన్ హీట్), ఆల్‌రౌండర్ వేదా కృష్ణమూర్తి(హోబర్ట్ హరికేన్స్) తరఫున ఆడేందుకు ఆయా ఫ్రాంచైజీలతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.