Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కరోనా వైరస్ తొలి డోసును వేయించుకున్నాడు. వ్యాక్సిన్ వేయించుకుంటున్న ఫొటోను పంత్ సోషల్‌మీడియాలో గురువారం పోస్ట్ చేస్తూ... 'ఇవాళ వాక్సిన్ తొలి డోస్ వేసుకున్నా... అర్హులైన వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోండి... ఎంత త్వరగా టీకా వేయించుకుంటే అంత త్వరగా ఈ వైరస్‌ను ఓడించగలం' అని ట్విటర్లో తెలిపాడు. పంత్ న్యూజిలాండ్‌తో జరిగే ఐసిసి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్‌తో పాటు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు టీమిండియాలో జట్టులో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.