Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం
దుబారు: అంతర్జాతీయ క్రికెట్‌మండలి (ఐసిసి) గురువారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్ల్లి సారథ్యంలోని భారత జట్టు మళ్లీ అగ్రస్థానానికి ఎగబాకింది. భారత్ టెస్టు ర్యాంకింగ్స్‌లో 121 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంకుకు చేరింది. ఇక న్యూజిలాండ్ 120పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. భారత్-కివీస్‌ల మధ్య ఒక్క పాయింట్ మాత్రమే తేడా ఉంది. ఇంగ్లండ్ వేదికగా జూన్‌లో జరిగే ఐసిసి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఈ రెండు జట్లే టైటిల్‌కై తలపడనున్నాయి. ఈ ఏడాది ఆస్ట్రేలియాపై 2-1తో టెస్టు సిరీస్ గెలిచిన భారత్.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 3-1తో సిరీస్‌ను కైవసం ఐసిసి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఐసిసి 2020నుంచి జరిగిన మ్యాచులకు 100%, అంతకుముందు రెండేళ్లకు 50%పాయింట్ల చొప్పున రేటింగ్స్ ఇచ్చింది.
ఇంగ్లండ్ (109పాయింట్లు) ఒక స్థానం ఎగబాకి మూడో స్థానంలో నిలవగా, ఆస్ట్రేలియా (108)నాలుగుకు చేరుకుంది. ఇక పాకిస్తాన్(94), వెస్టిండీస్(84) వరుసగా ఐదు, ఆరో స్థానాల్లో నిలిచాయి. దక్షిణాఫ్రికా(80), శ్రీలంక(78), బంగ్లాదేశ్(46), జింబాబ్వే(10) టాప్-10లో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.