Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: సోనిపట్ వేదికగా జరగాల్సిన రెజ్లింగ్ క్యాంప్‌ను రద్దు చేస్తున్నట్టు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) శనివారం ప్రకటనలో తెలిపింది. ఒలింపిక్స్ బెర్త్‌లే లక్ష్యంగా పురుష, మహిళా రెజ్లర్లకు ఈ శిక్షణా శిబిరం జరగాల్సి ఉంది. కఠినమైన క్వారంటైన్, ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఈ క్యాంప్ నిర్వహించడం కష్టంతో కూడుకున్నదని డబ్ల్యూఎఫ్ఐ పేర్కొంది. సోనిపట్‌లోని బహల్ఘర్లో మంగళవారం నుంచి రెజ్లర్లకు సారు కేంద్రంలో ఈ క్యాంప్ జరగాల్సి ఉంది. దీంతో యూరోప్‌లోని పోలెండ్ వేదికగా జూన్ 8-13 మధ్య జరిగే పోటీల అనంతరం ఆటగాళ్ల ర్యాంకింగ్స్ ఆధారంగా ఒలింపిక్స్‌కు మిగతా బెర్త్‌లు ఖాయం కానున్నాయని డబ్ల్యూఎఫ్ఐ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ థోమర్ పేర్కొన్నారు.