Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెల్బోర్న్: 2018 దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా బాల్ టాంపరింగ్(శాండ్ పేపర్ గేట్) సంఘటనను మళ్లీ విచారించనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) శనివారం ప్రకటించింది. దీనిలో ప్రధాన సూత్రధారిగా ఉన్న బాన్‌క్రాఫ్ట్ తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన సమాధానంతో సీఏ మరోసారి కళ్లు తెరవాల్సి వచ్చింది. బెన్‌క్రాఫ్ట్ మీడియాతో 'ఈ విషయం బౌలర్లందరికీ కచ్చితంగా తెలుసు. ఎందుకంటే నేను చేసిన పని బౌలర్లకు ఉపకరిస్తుంది. వివరంగా చెప్పాల్సిన పనిలేదు. మా జట్టులో అందరిచేతా ప్రశంసలు పొందాలనే ఉద్దేశం నన్ను బలంగా ఎగదోసింది. దీంతో శాండ్ పేపర్‌ను బంతికి పూసి జట్టుకు ఉపయోగంగా మారాలని అనుకున్నా. అది జరిగాక కానీ నేను చేసింది తప్పని తెలుసుకోలేకపోయా! తప్పని తెలిస్తే ముందే వేరే నిర్ణయం తీసుకునేవాడిని' అని చెప్పుకొచ్చాడు. ఈ వివాదం క్రికెట్ ప్రపంచంలో పెను దుమారం రేపడంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఇందులో ప్రధాన దోషులుగా ఉన్న బాన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలలు, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై ఏడాది వేటు వేసిన సంగతి తెలిసిందే.