Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోమ్: రోమ్ ఓపెన్ మాస్టర్స్ టెన్నిస్ మహిళల సింగిల్స్ ఫైనల్లోకి ఫ్రాన్స్‌కు చెందిన 9వ సీడ్ కరోలినా ప్లిస్కోవా, 15వ సీడ్ ఇగా స్వైటెక్(పోలెండ్) ప్రవేశించారు. శనివారం జరిగిన తొలి సెమీఫైనల్లో ప్లిస్కోవా 6-1, 3-6, 6-2 తేడాతో అన్‌సీడెడ్ క్రొయేషియాకు చెందిన మార్టిక్‌ను చిత్తుచేసింది. తొలిసెట్‌ను సునాయాసంగా గెల్చిన ప్లిస్కోవా రెండోసెట్‌ను చేజార్చుకుంది. నిర్ణయాత్మక మూడో సెట్లో చెలరేగిన ప్లిస్కోవా ఆ సెట్‌ను 6-2తో గెలిచి మ్యాన్‌ను ముగించింది. మరో సెమీస్‌లో స్వైటెక్ 7-6(7-3), 6-3తో అమెరికా యువ సంచలనం కోకా గాఫ్‌ను ఓడించింది. ఆదివారం జరిగే ఫైనల్లో టైటిల్‌కై ప్లిస్కోవా-స్వైటెక్ పోటీపడనున్నారు.
నాదల్ కూడా..
పురుషుల సింగిల్స్ ఫైనల్లోకి 2వ సీడ్, స్పెయిన్‌కు చెందిన రఫెల్ నాదల్ ప్రవేశించాడు. సెమీస్‌లో నాదల్ 6-4, 6-4 తేడాతో అమెరికాకు చెందిన అన్‌సీడెడ్ ఒపెల్లాను చిత్తుచేశాడు. వరుససెట్లలో ముగించిన మ్యాచ్‌ను నాదల్ రెండు బ్రేక్ పాయింట్లు సాధించాడు. మరో సెమీఫైనల్ టాప్ సీడ్ సెర్బియాకు చెందిన నొవాక్ జకోవిచ్ ఇటలీ సంచలనం సొనేగోల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ విజేతతో టైటిల్‌కై నాదల్ తలపడనున్నాడు.