Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: భారత క్రికెట్కంట్రోల్బోర్డు(బీసీసీఐ) ఇంగ్లండ్ పర్యటనకు పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరడానికి ముందు భారత బృందమంతా మూడు ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లకు హాజరుకావాల్సి ఉంటుంది. ఆ మూడింట్లోనూ నెగెటివ్ రిపోర్ట్ వస్తేనే ఇంగ్లండ్ విమానం ఎక్కనున్నట్టు బీసీసీఐ ఓ అధికారి తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారంతా ఈ సిరీస్ మొత్తానికి దూరం కావాల్సిందేనని బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది.
ఈ పర్యటనలో భాగంగా భారత్ తొలుత న్యూజిలాండ్‌లో ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్(డబ్ల్య్యూటీసీ), ఆ తర్వాత 45రోజుల సుదీర్ఘ విరామం అనంతరం ఇంగ్లండ్ తో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడేం దుకు సిద్ధపడనుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత బృందానికి మార్గనిర్దే శకాలను బీసీసీఐ తయారు చేస్తోందని ఆ అధికారి చెప్పుకొచ్చారు.
మూడు ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు తప్పనిసరి మే 19కల్లా ముంబయికి చేరుకోవాల్సి ఉందని, ఇంగ్లండ్ టూర్‌కు వెళ్ళేవారంతా రెండుసార్లు ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లకు చేయించుకొని రావాలని, ముంబయి చేరుకున్నాక మరోసారి ఈ టెస్ట్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ మూడు సందర్భాల్లోనూ అందరికీ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి. ఆ తర్వాత 14 రోజులు ముంబయిలో క్వారంటైన్లో ఉండి, అనంతరం జూన్ 2న ఇంగ్లండ్‌కు బయల్దేరాల్సి ఉంటుందని బిసిసిఐని అందిన సమాచారం. ఈ పర్యటనకు స్టాండ్‌బై ఆటగాళ్లు ఎంపికైన ప్రసిధ్ కృష్ణ, ఆవేశ్ ఖాన్, ఆర్జాన్ ఎంపికవ్వగా.. మూడు నెలలకు పైగా సాగే పర్యటన కోసం బయల్దేరే క్రికెటర్లు వారి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లేం దుకు బిసిసిఐ అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.
తొలి డోస్ భారత్‌లో.. రెండో డోస్ ఇంగ్లండ్‌లో..
ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే వారంతా తప్పనిసరిగా కోవీషీల్డ్ తొలి డోస్‌ను భారత్‌లోనే వేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంగ్లండ్ చేరిన అనంతరం రెండు వారాలు క్వారంటైన్లు ఉండే బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జూన్ 18-22న డబ్ల్యుటిసి ఫైనల్స్ మ్యాచ్ భారత ఆడనుంది. ఇక రెండో డోస్‌ను ఇంగ్లండ్‌లో వేసేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేసింది. 18ఏళ్లకు పైబడిన వారికే ఈ నిబంధన వర్తించనుంది.