Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: సౌరాష్ట్ర మాజీ క్రికెటర్, బిసిసిఐ మ్యాచ్ రిఫరీ రాజేంద్రసింహ జడేజా(66) కరోనాతో మతిచెందారు. రాజేంద్ర సిన్హా కరోనాతో పోరాడుతూ ఆదివారం కన్నుమూసిన విషయాన్ని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. అద్భుత పేసర్ అయిన రాజేంద్ర 1974-75, 1986-87 మధ్యకాలంలో సౌరాష్ట్ర తరఫున ఆడాడు. రాజేంద్రసిన్హా 50 ఫస్ట్‌క్లాస్ మ్యాచుల్లో 1536 పరుగులతో 134వికెట్లు, 11 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 104 పరుగులతోపాటు 14 వికెట్లు పడగొట్టారు. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌లో సెలెక్టర్, కోచ్, టీమ్ మేనేజర్‌గా పనిచేశారు. బిసిసిఐ రిఫరీగా 53 ఫస్టక్లాస్ మ్యాచ్‌లకు, 18 లిస్ట్-ఏ, 34 టి20 మ్యాచ్‌లకు పనిచేశారు.